సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2018 (14:51 IST)

బీజేపీ నాటకాలాడుతోంది... వ్యక్తిగత విమర్శలు వద్దు : నేతలకు చంద్రబాబు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాటకాలాడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యంగా, రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలాడుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు రాయలసీమ ఇప్పుడు గు

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాటకాలాడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ముఖ్యంగా, రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలాడుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా అని నిలదీశారు. 
 
ఆయన శనివారం పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పని చేయాలన్నారు. అదేసమయంలో బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సూచించారు. ఏపీని ప్రత్యేకంగా చూస్తానన్న కేంద్రం తన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టంచేశారు.
 
ఇకపోతే, తాజాగా బీజేపీకి చెందిన రాష్ట్ర నేతలు కర్నూలులో సమావేశమై ఓ తీర్మానాన్ని చేయగా, దీనిపై చంద్రబాబు స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమను అభివృద్ధి చేశామని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో చంద్రబాబు విభేదిస్తూ, తానూ రాయలసీమ బిడ్డనేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.