సంబంధిత వార్తలు
- టీడీపీ అవిశ్వాస తీర్మానానికి పెరుగుతున్న మద్దతు
- చంద్రబాబు సర్కారుకు పవన్ అల్టిమేటం.. 48 గంటల డెడ్లైన్
- ఎన్డీయేతో ఎందుకు తెగదెంపులు చేసుకున్నామంటే : చంద్రబాబు
- నేను ప్రజల డైరక్షన్లో పనిచేస్తున్నా.. ఏ పార్టీ దర్శకత్వంలో కాదు: పవన్ వార్నింగ్
- బొక్కలున్న మీకు భయం.. నాకు కాదు.. తమాషాలేస్తే...: పవన్ వార్నింగ్
తెలుగుదేశం అవిశ్వాసానికి వైకాపా మద్దతు... ఇతర పార్టీలు కూడా
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి విపక్ష వైకాపా కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి విపక్ష వైకాపా కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
ఇదే అంశంపై శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడిన విజయసాయి.. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీకైనా మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై తామూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి బీజేపీ మినహా ఇతర అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరినట్లు చెప్పారు. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి వైసీపీ మద్దతు ఇవ్వదంటూ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
కాగా, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం, ఆప్, బిజూ జనతా దళ్ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయి. అలాగే, అన్నాడీఎంకే, తెరాస పార్టీల మద్దతును కూడగట్టే పనిలో టీడీపీ ఎంపీలు ఉన్నారు.
