మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (15:00 IST)

'ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు. మేమే సూపర్‌స్టార్లం' : బాలకృష్ణ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వంపైనా, సీఎం తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వంపైనా, సీఎం తనయుడు, ఐటీ మంత్రి నారా లోకేశ్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ విమర్శలతో ఒక్కసారిగా టీడీపీ నేతలు కుదేలయ్యారు. ఆ తర్వాత తేరుకుని పవన్‌పై మాటల యుద్ధానికి దిగారు. 
 
ఈనేపథ్యంలో తన సొంత నియోజకవర్గమైన హిందూపూర్‌లో సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఆయన శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎంజీఎం గ్రౌండ్‌లో ఇండోర్ స్టేడియంకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. అపుడు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, 'ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు. మేమే సూపర్‌స్టార్లం' అంటూ బాలయ్య సమాధానమిచ్చారు.