మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (10:39 IST)

దటీజ్ మోడీ.. అవసరం తీరాక.. పొమ్మనకుండా పొగ

భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకోవడం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో బీజేపీ మాట తప్పిందన్న విమర్శలు ఎక

భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ తెగతెంపులు చేసుకోవడం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో బీజేపీ మాట తప్పిందన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. విభజన సమయంలో కాంగ్రెస్‌కు బీజేపీ పూర్తిగా సహకరించినప్పటికీ తర్వాతైనా న్యాయం చేస్తుందని ప్రజలు విశ్వసించారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అధినేత అమిత్ షాలు మాత్రం కక్షగట్టి మరీ మొండిచేయి చూపారు. అంతేకాకుండా, ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు వెళ్లేలా చేశారు. 
 
నిజానికి 2014 ఎన్నికల ముందు దేశ వ్యాప్తంగా ప్రచారం ఉద్ధృతంగా సాగుతున్న తరుణమిది. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఎన్డీయే ప్రచార సభలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తదితరులంతా పాల్గొన్నారు. వేదికపై ఒక కుర్చీపై మాత్రం ప్రత్యేకంగా పెద్దటవల్‌ వేసి ఉంచారు. అది... మోడీ కోసం. ఆ కుర్చీలో కూర్చోవాలని మోడీని కోరి... చంద్రబాబు పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబోయారు. ఇందుకో మోడీ ససేమిరా అంగీకరించలేదు. 
 
చంద్రబాబు వద్దన్నా వినకుండా, చేతులు పట్టుకుని బలవంతంగాలాగిమరీ తనకోసం ప్రత్యేకించిన కుర్చీలో ఆయనను కూర్చోబెట్టారు. తాను పక్కనున్న కుర్చీలో కూర్చున్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు సార్వత్రికల ఎన్నికలు ముగిశాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించింది. ఆ తర్వాత మోడీని చంద్రబాబు ఢిల్లీలో కలిశారు. మోడీ ఏపీకి వచ్చారు. మోడీని కలిసినప్పుడల్లా చంద్రబాబు వంగి వంగి నమస్కారం పెట్టడమే. చివరికి... కొన్ని నెలలపాటు చంద్రబాబుకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ కూడా దొరకలేదు! దటీజ్‌ మోడీ! అంటే పొమ్మనకుండా పొగబెట్టారన్నమాట.