శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 16 మార్చి 2018 (18:39 IST)

పవన్ పిచ్చోడా? మిమ్మలను కాదంటే పిచ్చోడిగా ముద్రవేస్తారా? తమ్మారెడ్డి (Full Video)

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలకులపై విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిచ్చోడు అంటూ విమర్శలు గుప్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చ

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలకులపై విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పిచ్చోడు అంటూ విమర్శలు గుప్పిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలకు సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇదే అంశంపై ఆయన తన యూట్యూబ్ చానెల్‌లో తన సందేశంతో కూడిన వీడియోను పోస్ట్ చేశారు. 
 
అందులో ఇటు తెలుగుదేశం పార్టీ నేతలను, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ అధినేత అమిత్ షాల తీరును ఎండగట్టారు. ముఖ్యంగా, పవన్‌పై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై తమ్మారెడ్డి స్పందిస్తూ, పవన్ కళ్యాణ్ పిచ్చోడు అయ్యుంటే.. నాలుగేళ్ళ క్రితం ఆయన ఇంటికెళ్లి.. ఇదే ముఖ్యమంత్రి 2 గంటల పాటు వేచివుండి ఆయనతో సమావేశమై, ఆయన మద్దతు ఎందుకు తీసుకున్నారు? 
 
అపుడు పిచ్చోడు కాదా.. ఇపుడు షడన్‌గా పిచ్చోడు అయ్యాడా? కొత్తగా పిచ్చిపట్టిందా? మిమ్మలను కాదన్నవాడు ప్రతివోడు పిచ్చోడు అని ముద్రవేచేస్తారన్నమాట. ఇదంతా విచిత్రంగా ఉంది. వీళ్లంతా అహంకార పూరితంగా మనం ఏది చెపితే అది నడుస్తుందన్న ఆలోచనతో ముందుకుసాగుతున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడిన పూర్తి వీడియోను మీరూ ఓసారి చూడండి.