శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 మార్చి 2018 (10:07 IST)

భారీ మెజారిటీతో ఆ అవిశ్వాసం గెలుస్తుంది : శివసేన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజార్టీతో గెలుస్తుందని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక "సామ్నా"లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం భారీ మెజార్టీతో గెలుస్తుందని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక "సామ్నా"లో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు తెలుగుదేశం పార్టీలపై కూడా విమర్శలు గుప్పించింది. 
 
మరో 25 యేళ్ల పాటు ప్రధాని మోడీ ప్రభుత్వాన్ని ఎవరూ కదిలించలేరన్న భ్రమలను తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పటాపంచలు చేసిందని ఎన్డీయే కూటమిలో మరో కీలక భాగస్వామిగా ఉన్న శివసేన వ్యాఖ్యానించింది. ఎన్డీయే సర్కారుపై అపనమ్మకం ఏర్పడిందని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. వచ్చే యేడాది జరిగే ఎన్నికల్లో వారి నిరసన జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమంటాయని పేర్కొంది. 
 
ముఖ్యంగా, టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానంపై చర్చ జరిగి ఓటింగ్ అంటూ జరిగితే భారీ మెజారిటీతో ఆ అవిశ్వాసం గెలుస్తుందని తన పత్రిక 'సామ్నా' సోమవారంనాటి సంపాదకీయంలో జోస్యం చెప్పింది. ఇదే సమయంలో టీడీపీ తన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసమే అవిశ్వాసం ప్రతిపాదించిందని ఆరోపించింది.