మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (18:46 IST)

ఢిల్లీలో అమిత్ షా కీలక భేటీ.. సమావేశానికి వైకాపా వ్యూహకర్త

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ పార్టీ అధినేత అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన ఏపీకి చెందిన పార్టీ నేతలను ఢిల్లీకి పిల

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ పార్టీ అధినేత అమిత్ షా రంగంలోకి దిగారు. ఆయన ఏపీకి చెందిన పార్టీ నేతలను ఢిల్లీకి పిలిపించుకుని శనివారం కీలక మంతనాలు జరిపారు. అయితే, ఈ సమావేశానికి వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్‌ హాజరుకావడం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇందులో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు.. అవిశ్వాస తీర్మానం, ఏపీకి కేంద్ర సర్కారు చేసిన సహాయంపై చర్చించినట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ కూడా రంగంలోకి దిగారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చంద్రబాబు కంటే ఎక్కువ నిబద్ధతతో ఉన్నామన్నారు. భవిష్యత్‌లోనూ ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అమిత్ షా‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాంమాధవ్.. సెంటిమెంట్‌కు అభివృద్ధితోనే సమాధానం చెబుతామన్నారు. ఇప్పటివరకూ చంద్రబాబు ప్రశ్నలు వేస్తున్నారు.. వాటన్నింటికీ సమాధానం చెబుతామని, అదేవిధంగా తాము అడిగే ప్రశ్నలకూ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన అన్నారు.