మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (14:44 IST)

బీజేపీని ఓడించేందుకు మళ్లీ చేతులు కలుపనున్న ఎస్పీ - బీఎస్పీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మళ్లీ ఓడించేందుకు బద్ధశత్రువులైన ఎస్పీ - బీఎస్పీలు మళ్లీ చేతులు కలుపనున్నాయి. ఇటీవల గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో ఈ రెండు పార్టీలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మళ్లీ ఓడించేందుకు బద్ధశత్రువులైన ఎస్పీ - బీఎస్పీలు మళ్లీ చేతులు కలుపనున్నాయి. ఇటీవల గోరఖ్‌పూర్, ఫుల్పూర్ లోక్‌సభ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. 
 
ఈ తీర్పుతో మరింతగా ఉత్తేజం పొందిన ఎస్పీ, బీఎస్పీలు భవిష్యత్‌లోనూ కలిసి పోటీ చేయాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఇందులోభాగంగా, మరో 5 నెలల్లో జరుగనున్న ఉపఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. 
 
బీజేపీకి చెందిన కైరానా లోక్‌సభ సభ్యుడు హుకుంసింగ్, ఇదే పార్టీకి చెందిన నూర్పూర్ ఎమ్మెల్యే లోకేంద్రసింగ్‌ల మృతితో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండింటికీ త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. 
 
ఈ రెండు స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేయడం ద్వారా విజయఢంకా మోగించవచ్చని భావిస్తున్నాయి. తద్వారా వచ్చే 2019 లోక్‌సభ ఎన్నికలకు ఊపు తీసుకురావచ్చని ఎస్పీ భావిస్తోంది. ఉపఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థులకు మద్దతు ఇస్తే బీఎస్పీ అభ్యర్థికి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరుగుతోంది.