శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 15 మార్చి 2018 (15:11 IST)

గోరఖ్‌పూర్‌లో బీజేపీని ఓడించిన తెలుగు ఓటర్లు.. ఇక కర్ణాటకపై దృష్టి...

దేశంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న కంచుకోటల్లో గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం ఒకటి. ఈ స్థానం గత మూడు దేశాబ్దాలుగా బీజేపీ గుప్పెట్లో ఉంది. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం కంటే గోరఖ్‌పూర్ మంఠం ఎంతో ప్రసిద్ధి.

దేశంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న కంచుకోటల్లో గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం ఒకటి. ఈ స్థానం గత మూడు దేశాబ్దాలుగా బీజేపీ గుప్పెట్లో ఉంది. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం కంటే గోరఖ్‌పూర్ మంఠం ఎంతో ప్రసిద్ధి. ఈ స్థానంలో తెలుగు ఓటర్లు కూడా అధికంగానే ఉన్నారట. వీరంతా కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం వల్లే తాజాగా వెలువడిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిత్తుగా ఓడిపోయారనే ప్రచారం సాగుతోంది.
 
నిజానికి ఈ స్థానం బీజేపీ పట్టుకొమ్మల్లో ఒకటి. గత 1998 నుంచి 2014 వరకు ఐదుసార్లు ఎంపీగా యోగి ఆదిత్యనాథ్ ఎన్నికయ్యారు. ఆయన యూపీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుధవారం వెలువడిన ఫలితం తారుమారైంది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
విభజనగాయాలు మానని నవ్యాంధ్రకు కేంద్రం చేస్తున్న అన్యాయంపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగువారు ఆగ్రహించిన కారణంగానే, కమలం ఓడిపోయిందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కర్ణాటక బీజేపీ నేతల్లో గుబులు మొదలైంది. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలోని దాదాపు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్ణయించే స్థితిలో తెలుగువారి ఓట్లు ఉన్నాయి.
 
నిజానికి, వీటిలో 30 నియోజకవర్గాలు తమకు జై కొడతాయని నిన్నటిదాకా బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలతో కమలనాథుల ఊపంతా అణగారిపోయిందని చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటిస్తే కన్నడనాట తెలుగు వారి ఓట్లు చెక్కుచెదరకుండా బీజేపీకి పడతాయని ఆ పార్టీకి చెందిన నేతలు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. మొత్తంమీద బీజేపీని తెలుగు ఓటర్లు పగబట్టారనే చెప్పొచ్చు.