శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (15:12 IST)

గోరఖ్‌పూర్‌లో జైలు ఖైదీలకు ఎయిడ్స్...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జైలులో ఉండే ఖైదీల్లో 23 మందికి ప్రాణాంతక ఎయిడ్స్ ఉన్నట్టు తేలింది. ఈ జైలులో ఉన్న 58 మంది ఖైదీలకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో 23 మందికి హెచ్.ఐ.వి ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో ఓ మహిళ కూడా ఉండటం గమనార్హం. 
 
అలాగే, జైలులో ఉన్న ఖైదీలలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, మధుమేహం, హృద్రోగం వంటి సమస్యలతో బాధపడుతున్నట్టు ఈ పరీక్షల్లో తేలింది. దీనిపై జైళ్ళ శాఖ డీఐజీ యడవేంద్ర శుక్లా చెప్పారు. గత ఏడాది ఉన్నావో జిల్లా జైలులో 58 మంది ఖైదీలకు ఎయిడ్స్ ఉందని తేలిందని చెప్పారు. వీరికి జైల్లోనే ఉంచి వ్యాధి ఎక్కువ కాకుండా చికిత్స చేస్తున్నట్టు చెప్పారు.