శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:58 IST)

బాబు పెద్ద తప్పేమీ చేయలేదు.. జైలుకెళ్తే ఓట్లు రాలుతాయ్: ఉండవల్లి

ఏపీ సీఎం చంద్రబాబును జైలుకు పంపితే.. ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఓటుకు నోటు కేసులో తనను అరెస్ట్ చేసి జైలులో పెడతారన్న భయం ఏపీ సీఎం చంద్రబాబుకు అ

ఏపీ సీఎం చంద్రబాబును జైలుకు పంపితే.. ఏపీ ప్రజలు చూస్తూ ఊరుకోరని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఓటుకు నోటు కేసులో తనను అరెస్ట్ చేసి జైలులో పెడతారన్న భయం ఏపీ సీఎం చంద్రబాబుకు అక్కర్లేదని ఉండవల్లి వ్యాఖ్యాంచారు.

తన ఉద్దేశం ప్రకారం ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లేటంత తప్పు చేయలేదని, ఒకవేళ కేంద్రం కక్ష సాధింపు చర్య కోసం జైలుకు పంపిస్తే.. అదికూడా లాభిస్తుందని ఉండవల్లి చెప్పారు. 
 
అకాలీదళ్, శివసేన తమ మద్దతును ఉపసంహరించుకోగా.. టీడీపీ కూడా తమ మద్దతును విరమిస్తే.. మోదీ వెంట నిలిచిన నితీశ్ వంటి వారు కూడా ఆలోచనలో పడతారని తెలిపారు. అక్రమాస్తుల కేసులో వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డికి ఎలా సింపథీ ఓట్లు పడ్డాయో బాబు గుర్తుంచుకోవాలన్నారు.

అదే తరహాలో చంద్రబాబు జైలుకెళ్లినా ఓట్లు రాలడం ఖాయమని ఉండవల్లి తెలిపారు. ఇకపోతే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్కారుకు లోక్ సభలో మెజారిటీ లేదని ఉండవల్లి చెప్పారు.