మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (16:24 IST)

వెంకయ్యాజీ.. రాజీనామా చేసి చరిత్రలో నిలిచిపోండి : సినీ రచయిత బీవీఎస్ రవి

గతంలో ఇచ్చిన హామీ మేరకు విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇందుకోసం టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా

గతంలో ఇచ్చిన హామీ మేరకు విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇందుకోసం టీడీపీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతిగా ఉన్న తెలుగు నేత వెంకయ్య నాయుడు కూడా ఆ పదవికి రాజీనామా చేయాలన్న పలువురు డిమాండ్ చేస్తున్నారు. 
 
తాజాగా టాలీవుడ్ సినీ రచయిత రవి కూడా ఈ విషయంపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రత్యేక హోదా కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'వెంకయ్యగారూ మీరు పవర్‌లో ఉండాలని కోరుకుంటున్నారా? లేక ప్రత్యేక హోదా సాధన కోసం ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసి చరిత్రలో నిలిచిపోవాలనుకుంటున్నారా?' అంటూ ప్రశ్నించారు. సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమన్నారు. 
 
ప్రత్యేక హోదాపై అన్ని రాజకీయ పార్టీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే... హక్కుల సాధన కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని రవి అన్నారు. ఐకమత్యం లేకుండా రాజకీయ లబ్ధి కోసం పోరాటం చేస్తే, ఫలితం ఉండదన్నారు. తెలంగాణ పోరాటం మనందరికీ స్ఫూర్తి అంటూ చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.