సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (12:05 IST)

పోకిరి భామకు కోపమొచ్చింది.. అజయ్‌తో సంబంధమా.. ఫన్నీగా వుంది

''పోకిరి'' భామ ఇలియానా మళ్లీ వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చిన ఇలియానా.. అజయ్ దేవగణ్‌తో తనకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. తనకు ఆఫర్లు ఇవ్వాలని అజయ్ దేవగన్

''పోకిరి'' భామ ఇలియానా మళ్లీ వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు మకాం మార్చిన ఇలియానా.. అజయ్ దేవగణ్‌తో తనకు సంబంధాలున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించింది. తనకు ఆఫర్లు ఇవ్వాలని అజయ్ దేవగన్ సిఫార్సు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని.. ఫన్నీగా వుందని ఇలియానా చెప్పుకొచ్చింది. అంతేగాకుండా ''రైడ్'' చిత్రానికి అజయ్ సిఫార్సు చేశాడని.. ముబారకన్ కో-స్టార్ అర్జున్ కపూర్ పరిశీలించమని తన వద్దకు ఓ స్క్రిప్ట్ కూడా పంపాడని ఇలియానా వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.
 
ఓ స్టార్‌తో రెండు మూడు సినిమాలు చేస్తే వెంటనే ఏవో పుకార్లు పుట్టిస్తారంటూ ఇలియానా మండిపడింది. సినీ అవకాశాలు వస్తే.. ముందుగా ఆ స్కిప్ట్ నచ్చాకే ఏదైనా చేస్తానని చెప్పింది. అజయ్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేసింది. ఇకపోతే.. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీ బోన్‌తో ఇలియానా సహజీవనం చేస్తున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజం చేస్తున్నట్లు ఇలియానా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆండ్రూతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తోంది.