బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 3 మార్చి 2018 (15:11 IST)

'అవసరాల' ప్రేమలో పడిన టాలీవుడ్ హీరోయిన్

సాధారణంగా హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. కానీ, ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఓ కమెడియన్ ప్రేమలో పడింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు. ఈషా రెబ్బా. కమెడియన్ అవసరాల శ్రీనివాస్. ఈయన కేవలం కమెడియన్‌ మాత్రమే కాదు...

సాధారణంగా హీరోహీరోయిన్లు ప్రేమించుకుంటారు. కానీ, ఓ టాలీవుడ్ హీరోయిన్ మాత్రం ఓ కమెడియన్ ప్రేమలో పడింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు. ఈషా రెబ్బా. కమెడియన్ అవసరాల శ్రీనివాస్. ఈయన కేవలం కమెడియన్‌ మాత్రమే కాదు... డైరెక్టర్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా. పలు విజయవంతమైన సినిమాలు తీసిన, నటించిన ఘనత ఆయన సొంతం. 
 
గత కొన్నినెలలుగా వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందట. వీరు ప్రేమలో ఉన్న కారణంగానే కలిసి కనిపిస్తున్నారని సినీ జనాలు అంటున్నారు. అయితే, ఈ కామెంట్స్‌పై వారిద్దరూ స్పందించడం లేదు. దాంతో వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహమా? ప్రేమనా? అన్న అనుమానం చాలా మందికి వస్తోంది.