మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మార్చి 2025 (17:51 IST)

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

kid
భూకంపం బారినపడిన బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. భూకంపం భయంతో అక్కడ ఉండే అన్ని ఆస్పత్రులను వైద్య సిబ్బంది ఖాళీ చేయించారు. రోడ్లు, పార్కుల్లో రోగులను ఉంచి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ గర్భిణి నడిరోడ్డుపై వీల్‌చైర్‌లో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. 
 
శుక్రవారం నాటి భూకంపం నేపథ్యంలో బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేయించారు. ఈ క్రమంలో ఓ మహిళ వీధిలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ ఘటన అక్కడి కెమెరాల్లో రికార్డు అయింది. భూకంపం భయంతో ప్రజలు ఆందోళనతో ఉన్న వేళ, అక్కడి పరిసరాలు భీతావహంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓ మహిళ మగబిడ్డకు జన్మనివ్వడం గమనార్హం. 
 
పరిసరాలు గందరగోళంగా ఉండగా ఆస్పత్రి స్ట్రెచర్‌పైనే మహిళ ప్రసవించింది. దీన్న గమనించిన ఆస్పత్రి సిబ్బంది స్ట్రెచర్ చుట్టూ చేరి ఆమెకు అవసరమైన సాయం అందించారు. కాగా, భూకంప భయంతో కింగ్ చులాలాంగ్ కోర్న్ మెమోరియల్ ఆస్పత్రి, బీఎన్‌హెచ్ ఆస్పత్రిని ఖాళీ చేయించిన సిబ్బంది రోగులను పక్కనే పార్కులో ఉంచారు. నర్సులు, వైద్యులు అక్కడే ఉంటూ రోగులకు వైద్యం అందిస్తున్నారు.