మంగళవారం, 1 ఏప్రియల్ 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 30 మార్చి 2025 (15:37 IST)

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

kamakya express derail
ఒరిస్సా రాష్ట్రంలో రైలు ప్రమాదం సంభవించింది. బెంగుళూరు నుంచి గౌహతికి వెళుతున్న కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన శనివారం రాత్రి 11.54 గంటల సమయంలో కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ వద్ద జరిగింది. అయితే, అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. 
 
ఈ ప్రమాదంలో మొత్తం 11 ఏసీ బోగీలు పట్టాలు తప్పాయని, ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారభించినట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్వో అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ ఘటనకు విషయం తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. రైల్వే ఉన్నతాధికారులు ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. 
 
ఈ ప్రమాదం కారణంగా కొన్ని రైళ్ల రాకపోకల్లో మార్పులు చేయగా, మరికొన్ని రైళ్ళను దారిమళ్లించినట్టు తెలిపారు. ట్రాక్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖ ప్రయాణికుల కోసం హెల్ప్ లైన్ నంబర్లను రైల్వే శాఖ విడుదల చేసింది. కాగా, గత 2023లో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెల్సిందే. షాలిమార్ - చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగుళూరు - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు ఒకదానికొకటి ఢీకొనగా 296 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1200 మంది వరకు గాయపడిన విషయంతెల్సిందే.