ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!
దేశ వ్యాప్తంగా యేటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాదమరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనచోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ద్విచక్ర వాహన విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని దిచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు.
మంత్రి ప్రకటనను టూ వీలర్స్ మాన్యుఫ్యాక్సరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీహెచ్ఎంఏ) సంపూర్ణ మద్దతు తెలియజేసింది. తాజా నిర్ణయంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ఇద్దరూ హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. దీంతో ద్విచక్ర వాహన చోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ద్విచక్ర వాహన విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని దిచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు.
మంత్రి ప్రకటనను టూ వీలర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంపూర్ణ మద్దతు తెలియజేసింది. తాజాగా నిర్ణయంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ఇద్దరూ హెల్మెట్లు ధరించాల్సి ఉంటుంది. దీంతో ద్విచక్ర వాహన విక్రేతలు నూతన బైక్ కొనుగోలు సమయంలోనే రెండు హెల్మెట్‌లను విక్రయించనున్నారు.