తిరుమల శ్రీవారికి కానుకంగా లగ్జరీ ఎలక్ట్రిక్ స్కూటర్ల గిఫ్ట్
తిరుమల శ్రీవారికి ప్రముఖ ద్విచక్రవాహన తయారీ కంపెనీ టీవీఎస్ లగ్జరీ బైకును బహుమతిగా ప్రధానం చేసింది. ఈ వాహనాలను ఆ సంస్థ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్ తితిదే అధికారులకు అందజేశారు. ఎన్డీఎస్ ఎకో సంస్థ కూడా ఓ ద్విచక్రవాహనాన్ని అందించింది. ఈ సందర్భంగా బైకు దాతలను తితిదే ఏవీవో వెంకయ్య చౌదరి అభినందించారు.
సాధారణంగా శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చే భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు తీర్చుకుంటారు. తమ శక్తి మేరకు కానుకలు సమర్పిస్తుంటారు. వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ సెలెబ్రిటీలు భారీగా విరాళాలు ఇస్తుంటారు భక్తులు స్వామివారికి ఎక్కువగా నగదు, నగలు కానుకలుగా ఇస్తుంటారు. తాజాగా శ్రీవారికి ఖరీదైన లగ్జరీ బైకులను అందజేశారు.
చెన్నైకు చెందిన టీవీసీ, బెంగుళూరు నగరానికి చెందిన ఎన్డీఎస్ ఎకో సంస్థలు ఈ ఎకో ద్విచక్రవాహనలను ఆయా సంస్థల అధినేతలు కానుకగా అందజేశారు. టీవీఎస్ అందించిన ఐక్యూబ్ ఎక్స్ వాహనం ధర రూ.2.70 లక్షలు కాగా, ఎన్డీఎస్ ఎకో అందించిన వాహనం ధర రూ.1.56 లక్షలని ఆయా సంస్థల ప్రతినిధులు వెల్లడించారు.
ఆలయం వద్ద వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత బైక్ తాళాలను ఏఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. ఈ సంర్భంగా వారిని ఏఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో టీవీఎస్ సంస్థ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎండీ సుదర్శన్, తిరుమల డీఐ సుబ్రహ్మణ్యం, ఎన్డీఎస్ ఎకో సంస్థ చైర్మన్ ఎంహెచ్ రెడ్డి తదితరులు ఉన్నారు.