శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (18:46 IST)

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

wife
wife
కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చి అర్ధాంగి అనే మాటకు సంపూర్ణ అర్థాన్ని ఇచ్చింది ఓ భార్యామణి. చిన్న చిన్న విషయాలకే మనస్పర్థలు, గొడవలు పెట్టుకుని చెట్టుకున్న ఆకులు కోసుకున్నంత సులభంగా విడాకులు తీసుకుని భార్యాభర్తల బంధానికి బై బై చెప్పేస్తున్న ఈ కాలంలో.. తన భర్తకు ప్రమాదకరమైన ఆరోగ్య సమస్య వస్తే అవయవదానం చేసింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా, రఘునాథపాలెం మండలం పెద్ద ఈర్లపూడికి చెందిన ధరావత్ శ్రీనివాస్.. ఖమ్మంలోని ఏపీజీవీబీ బ్యాంకులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లావణ్య ఎల్ఎల్బీ చివరి సంవత్సరం చదువుతోంది. 
 
శ్రీనివాస్ లావణ్య దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌కు కాలేయం సమస్య వుందని వైద్య పరీక్షల్లో తేలింది. పలు పరీక్షలు చేసిన తర్వాత.. కాలేయ మార్పిడి చేస్తేనే శ్రీనివాస్‌ బతుకుతాడని వైద్యులు తేల్చేశారు. కానీ ఎక్కడా కాలేయ దాత దొరకలేదు. 
 
ఈ క్రమంలో.. తన భర్తను ఎలాగైనా బతికుంచుకోవాలని నిర్ణయించుకున్న లావణ్య.. తన కాలేయాన్ని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో.. లావణ్యకు అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమె కాలేయం శ్రీనివాస్‌కు సరిపోతుందని నిర్ధారించారు. 
 
ఈ మేరకు లావణ్య లివర్ నుంచి 65 శాతం మేర తీసిన సికింద్రాబాద్‌ కిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు.. విజయవంతంగా ఆపరేషన్ చేసి శ్రీనివాస్‌కు అమర్చారు. ప్రస్తుతం శ్రీనివాస్, లావణ్య.. దంపతులిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. తన కాలేయాన్ని దానం చేసి భర్తకు పునర్జన్మ ప్రసాదించిన లావణ్యను పలువురు అభినందిస్తున్నారు.