పవన్ కల్యాణ్ గారికి దణ్ణం, తుమ్మలచెరువు గ్రామంలో శరవేగంగా సీసీ రోడ్డు పనులు video
గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు తుమ్మలచెరువు గ్రామపంచాయతీలో సీసీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి
.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం మండలం, తుమ్మలచెరువు గ్రామంలో రోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పనులు వేగవంతమవుతున్న వేళ.. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు.
ఇకపోతే.. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు సాధించారు. ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి రికార్డు నెలకొల్పారు. ఈ సందర్భంగా రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. గ్రామ పాలనలో ఈ అతిపెద్ద కార్యక్రమం వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తింపు పొందింది. తాజాగా గ్రామాలను సుందరంగా తీర్చి దిద్ది గ్రామాల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించే దిశగా పనులను ముమ్మరం చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. తమ గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పిస్తున్నందుకు ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.