గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 6 ఫిబ్రవరి 2025 (13:57 IST)

అది లేకుండా విజయవాడ రోడ్లపై తిరిగితే రూ. 10 వేలు ఫైన్: ద్విచక్రవాహనదారులకు వార్నింగ్

traffic rules
విజయవాడలో ట్రాఫిక్ రూల్స్ పాటించేవారు ఎంతమంది అంటే వేళ్లపై లెక్కపెట్టేయవచ్చు. ఇక ట్రాఫిక్ నిబంధనలను తుంగలో తొక్కేవారి సంఖ్య లెక్కకు మిక్కిలి వుంటోంది. ఈ నేపధ్యంలో విజయవాడ నగర పోలీసు కమిషనర్ రాజశేఖర బాబు నిబంధనలను ఉల్లంఘించేవారిపై జరిమానా కొరడా ఝుళిపిస్తామని హెచ్చరించారు.
 
హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపితే జరిమానా విధిస్తామన్నారు. ఇదివరకూ వున్న జరిమానా ఇప్పుడు రూ. 1000కి పెరిగినట్లు వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే వాటికి చలానాలు విధిస్తున్నామనీ, 90 రోజుల లోపు పెండింగ్ చలానాలు చెల్లిస్తే సరే లేదంటే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తే వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కనుక ద్విచక్ర వాహనదారులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాహనాలను నడపాలని సూచన చేసారు.