గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవి
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2025 (11:08 IST)

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

Ram potineni
Ram potineni
రామ్ పోతినేని దర్శకుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఇందులో సాగర్ అనే పాత్ర చేస్తున్నాడు. భాగ్యశ్రీ  బోర్స్ నాయికగా నటిస్తున్నది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న్ సినిమాకు తాత్కాలికంగా రాపో 22 పేరుతో షూటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఓ వార్త వినిపిస్తుంది. ఇందులో కీలక పాత్ర కోసం మలయాళ సూపర్‌స్టార్  మోహన్ లాల్‌ను తీసుకోవాలని మేకర్స్ భావించారు.  కానీ  ఇంకా దాని గురించి నిర్ణయం తీసుకోలేదని వర్గాలు తెలిపాయి.

కాగా, రామ్ పోతినేనికి 2019లో విడుదలైన ‘ఇస్మార్ట్ శంకర్’  తర్వాత అతను చాలా సినిమాలు చేసాడు, అందులో ‘డబుల్ ఇస్మార్ట్’ సీక్వెల్ కూడా ఉంది, కానీ అన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. ఇప్పుడు, రామ్ దర్శకుడు మహేష్ బాబు పి తో ఒక సినిమా చేస్తున్నాడు మరియు షూటింగ్ కూడా ప్రారంభమైంది. షూటింగ్‌లో ఎక్కువ భాగం కోసం యూనిట్ రాజమండ్రికి బయలుదేరుతుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
 
యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం, కథానాయకుడు తన గ్రామంలో నిర్మించాలనుకుంటున్న సినిమా థియేటర్ చుట్టూ  కథ తిరుగుతుంది. కథలో కథానాయకుడు కూడా ఒక సూపర్‌స్టార్‌కి పెద్ద అభిమాని. అతని కోసం, సినిమా చూడటానికి వస్తాడు. ఆ సీన్ చాలా ఆసక్తి గా ఉంటుందట. సూపర్‌స్టార్ పాత్ర కోసం మలయాళ నటుడు మోహన్ లాల్‌ను తీసుకోవాలని మేకర్స్ అనుకునారు.  కానీ  ఇంకా దాని గురించి నిర్ణయం తీసుకోలేదని వర్గాలు తెలిపాయి. సాగర్ పాత్రలో రామ్ పోతినేని ఫస్ట్ లుక్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది  
 
రామ్ హిట్ కొట్టి చాలా సంవత్సరాలు అయింది. కాబట్టి, నిర్మాణ సంస్థ రామ్ పోతినేని కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకూడదని కోరుకుందని తెలుస్తుంది. అందుకే వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేయాలని వారు కోరుకున్నారు. మోహన్ లాల్ అంగీకరించకపోతే లేదా అందుబాటులో లేకపోతే, మేకర్స్ వేరే నటుడితో సినిమాను పూర్తి చేయాలని  అనుకుంటున్నారని తెలుస్తోంది.