శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 21 నవంబరు 2024 (15:22 IST)

క్రేజీ ఎంటర్‌టైనర్‌గా రామ్ పోతినేని 22వ చిత్రం పూజతో ప్రారంభం

Ram Pothineni's 22nd movie opeing
Ram Pothineni's 22nd movie opeing
ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం గురువారంనాడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. 'మిస్ శెట్టి మిస్టర్  పోలిశెట్టి' తర్వాత మహేష్ బాబు పి. దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలు. హీరోగా రామ్ 22వ చిత్రమిది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు. 
 
హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్ఛాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర దర్శకుడు మహేష్ బాబుకు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలితో పాటు ఆ సంస్థ సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేని స్క్రిప్ట్ అందజేశారు.
 
ఫీల్ గుడ్ అండ్ క్రేజీ ఎంటర్‌టైనర్‌గా వుండబోతున్న ఈ సినిమా కోసం రామ్ స్పెషల్‌గా మేకోవర్ అవుతున్నారు. యువతను ఆకట్టుకునే అంశాలతో పాటు చక్కటి కథ, కథనంతో సినిమా రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని వివరించారు.