ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (10:49 IST)

సాగర్ పాత్రలో హీరోగా రామ్ పోతినేని క్యారెక్టర్ లుక్ విడుదల

Ram Pothineni new look
Ram Pothineni new look
ఉస్తాద్ రామ్ పోతినేని వెర్సటైల్ యాక్టర్. క్యారెక్టర్లు, లుక్స్ పరంగా ఎప్పటికప్పుడు డిఫరెన్స్ చూపించే హీరో. ఇప్పుడు మరో కొత్త లుక్, క్యారెక్టర్‌తో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యువ దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కిస్తున్న సినిమా హీరో క్యారెక్టర్  లుక్ ఈ రోజు విడుదల చేశారు.
 
మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న సినిమా హీరోగా రామ్ 22వది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఈ రోజు ఆయన  క్యారెక్టర్  లుక్ విడుదల చేశారు. 'మీకు సుపరిచితుడు... మీలో ఒకడు... మీ సాగర్' అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు దర్శకుడు మహేష్ బాబు.
 
రామ్ క్యారెక్టర్ లుక్ చూస్తే... వింటేజ్ ఫీలింగ్ కలుగుతుంది. పాత రోజుల్లో ఉపయోగించే సైకిల్, రామ్ లాంగ్ హెయిర్ అండ్ క్లీన్ షేవ్, అన్నిటికి మించి రామ్ ముఖంలో నవ్వు... ఫస్ట్ లుక్ చూడగానే ఒక ఆహ్లాదకరమైన ఫీలింగ్ కలుగుతోంది. ఫస్ట్ లుక్ విడుదల చేయడంతో పాటు ఈ రోజు రెగ్యులర్ షూటింగ్ మొదలైందని దర్శక నిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. 
 
రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, మ్యూజిక్: వివేక్ - మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, కథ - కథనం - దర్శకత్వం: మహేష్ బాబు పి.