గురువారం, 6 ఫిబ్రవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2025 (12:01 IST)

రికార్డ్ స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. వరుసగా 35 మాసాలు వంద కోట్ల మార్క్

Hundi
తిరుపతి అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది తిరుమల, కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం. అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం. ఈ ఆలయానికి, ప్రపంచంలోని వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని భారీ సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. శ్రీవారి దర్శనం కోసం గంటలు గంటలు వేచి వుంటారు. స్వామి వారి దర్శనం కోసం ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, భక్తుల ఆకలి తీర్చేందుకు ఉచిత భోజనం వంటి వసతులు వున్నాయి. 
 
అలాగే శ్రీవారిని దర్శించుకునే భక్తులు తమ మొక్కులు తీరాక ఆలయంలోని హుండీలో భారీగా కానుకలు, డబ్బు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభం జనవరి నెలలో 20.05 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకా 106 కోట్ల 17 లక్షల రూపాయలు శ్రీవారికి హుండీ ఆదాయంగా వచ్చింది. ఈ ఆదాయంతో ఆలయ చరిత్రలోనే శ్రీవారి హుండీ కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది. తద్వారా వరుసగా వంద కోట్లకు పైగా హుండీ ఆదాయం సంపాదించిన 35వ మాసంగా జనవరి నిలిచింది. మార్చి 2022 నుంచి వరుసగా వందకోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటుతుందని టీటీడీ వెల్లడించింది.