సంబంధిత వార్తలు
- ఆత్మహత్య చేసుకుంటా, అనుమతివ్వండి: సింగరాయకొండ రోడ్డుపై మహిళ, ఎందుకు? (video)
- గోవాలో ఆత్మహత్యకు పాల్పడిన టాలీవుడ్ నిర్మాత!
- యువతిని నగ్నంగా వీడియో తీసిన వ్యక్తి అంతలోనే శవమయ్యాడు... ఎలా?
- Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య
- కణతకు గురిపెట్టుకుని తుపాకీతో కాల్చుకున్న ఎస్ఐ.. పాపం జరిగిందో..?
తరగతి గదిలోనే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకున్న విద్యార్థిని... ఎక్కడ?
మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. తరగతి గదిలోనే ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కుల్వకుర్తికి చెందిన అరాధ్య బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి విద్యాభ్యాసం చేస్తుంది. ఇంతలో ఏంజ జరిగిందో ఏమోగానీ, గురువారం ఉదయం పాఠశాల తరగతి గదిలో ఆరాధ్య ప్రాణాలు తీసుకుంది.
గురువారం ఉదయం 6.30 గంటలకు ఆరాధ్య తరగతి గదిలోని సీలింగ్ ఫ్యానుకు ఉరేసుంది. దీన్ని గమనించిన సహచర విద్యార్థులు టీచర్లకు సమాచారం చేరవేశారు. ఆ వెంటనే వారంతా పరుగున వచ్చి ఆరాధ్యను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆ విద్యార్థిని చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. అయితే, ఆరాధ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
