1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Vijay SHOCKING Decision-Trisha for Deputy CM Position

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

Vijay, Raghava lawrence, Trisha
Vijay, Raghava lawrence, Trisha
సినీనటి త్రిష రాజకీయాల్లో చక్రం తిప్పనుంది. తమిళనాట మరో జయలలితగా ఆమె మారనుందని ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె రాజకీయ ప్రయాణానికి సంబంధించిన అడ్డంకులు తొలగుతూ వస్తున్నాయి. 
 
తమిళనాడు రాజకీయాల్లో హీరో విజయ్ సీఎం అయ్యాక అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో.. సీఎం విజయ్ పెరంబూరు, తిరుచ్చి స్థానాల్లో గెలిచారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక స్థానానికి రాజీనామా చేయాలి. విజయ్ తిరుచ్చి స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధపడగా, రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నారని, టీవీకే విజయ్ పార్టీలో చేరి తిరుచ్చి నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. 
 
కానీ లారెన్స్ ఈ ప్రచారాన్ని ఖండించారు. ఇప్పుడు తిరుచ్చి స్థానంలో పోటీ చేయకుంటే తాను రాజకీయాల్లోకి రానట్లు కాదని, ఆచితూచి వ్యహరించి రాజకీయ ప్రవేశం చేస్తానని చెప్పారు. తిరుచ్చి ఈస్ట్‌లో మాత్రమే తాను పోటీ చేయట్లేదని చెబుతున్నానని, ఇతర నియోజకవర్గాలలో పోటీ చేయబోనని చెప్పడంలేదని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. 
 
సుఖపడేందుకు తాను రాజకీయాల్లోకి రావటం లేదని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే వస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉందని, ఆ తర్వాత వీలైనంత త్వరగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని రాఘవ లారెన్స్ ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
 
దీంతో త్రిష పేరు తెరపైకి వచ్చింది. ఆమె టీవీకే పార్టీ తరపున తిరుచ్చి నుంచి పోటీ చేసి, ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
Vijay Deverakonda: హైదరాబాద్ వాలీబాల్ ప్లేయర్స్ ను సపోర్ట్ చేసిన విజయ్ దేవరకొండ