1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Allari Naresh's Aaruguru Pathivrathalu is set to be re-released

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

Aaruguru Pathivratalu Re-release poster
Aaruguru Pathivratalu Re-release poster
అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు మూవీని మళ్ళీ రిలీజ్ చేయనున్నారు. జూన్ 30వ తేదీన అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటన వెలువడింది. ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రమిది. రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపిన బోల్డ్ అండ్ రియలిస్టిక్ కామెడీ డ్రామా ఈ చిత్రం.
 

అప్పట్లో ఈ సినిమా పోస్టర్లు, కంటెంట్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. థియేటర్లకు ప్రేక్షకులను క్యూ కట్టేలా చేసిన ఈ కల్ట్ క్లాసిక్ మరోసారి వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించడానికి రెడీ అవుతోంది.
 
ప్రముఖ నిర్మాణ సంస్థ ఇ.వి.వి.సినీమా బ్యానర్‌పై ఆయనే రూపొందించారు. 2004 ఫిబ్రవరి 6న విడుదలైన ఈ సినిమా, పెళ్లిళ్ల పేరిట జరిగే మోసాలు, పెళ్లయిన కొత్తలో భార్యాభర్తల మధ్య వచ్చే ఈగోలు, మనస్పర్థలను ఎంతో బోల్డ్‌గా, అదే సమయంలో కడుపుబ్బా నవ్వించే కామెడీతో ఇ.వి.వి. అప్పట్లో విమర్శలు, ప్రశసంలతో సరికొత్త ప్రయోగంగా ఈ సినిమాకు పేరు వచ్చింది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?