మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 28 మార్చి 2018 (21:56 IST)

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం... అర్థరాత్రి భర్త ఏం చేశాడంటే?

కూరగాయల మార్కెట్టులో పరిచయమైన వ్యక్తి మంచి స్నేహితుడుగా మారాడు. స్నేహితుడే కదా అని ఇంటికి తీసుకువెళితే అతడి భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్‌లో న

కూరగాయల మార్కెట్టులో పరిచయమైన వ్యక్తి మంచి స్నేహితుడుగా మారాడు. స్నేహితుడే కదా అని ఇంటికి తీసుకువెళితే అతడి భార్యతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే... హిందూపురం పట్టణంలోని త్యాగరాజనగర్‌లో నల్లచెరువు మండలం పూలకుంట గ్రామానికి చెందిన బోయ రాము గోరంట్లకు చెందిన మహిళను ఏడేళ్ల క్రితం పెళ్లాడాడు. వీళ్లద్దరికీ ఓ కుమారుడు కూడా వున్నాడు. ఐతే పెళ్లయ్యాక కొన్ని రోజులకు వారి మకాన్ని శ్రీకంఠపురానికి మార్చారు. 
 
కూరగాయల వ్యాపారం చేస్తున్న శ్రీనివాసులికి రాముతో పరిచయం ఏర్పడింది. దాంతో అతడు తరచూ శ్రీనివాసులతో కలిసి రాము ఇంటికి వస్తుండేవాడు. అలా వస్తున్న రాము శ్రీనివాసులు భార్యతో సంబంధం పెట్టుకున్నాడు. విషయం కాస్తా రాముకు తెలిసిపోయింది. దాంతో అతడిని హెచ్చరించాడు. కానీ రాము పట్టించుకోలేదు. అతడి భార్య కూడా ఖాతరు చేయలేదు. 
 
భార్య వైఖరితో విసిగిపోయిన శ్రీనివాసులు ఆమెను హత్య చేయాలని అనుకున్నాడు. సోమవారం రాత్రి ఆమెను చంపేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇంతలో రాము కూడా అక్కడే నిద్రపోతూ కనిపించాడు. ఆ సమయంలో భార్యను చంపితే రాము తిరగబడతాడని భావించి అతడిపై కొడవలితో విచక్షణా రహితంగా దాడి చేసి నరికాడు. దీనితో అతడి భార్య కేకలు వేసింది. ఇరుగుపొరుగు రావడంతో పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన రామును ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా వుండటంతో అతడిని బెంగళూరుకు తరలించారు.