శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (09:14 IST)

ప్రత్యేక హోదా పోరు : 6వ రోజుకు చేరిన వైకాపా ఎంపీల ఆమరణ దీక్ష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా వైకాపా ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష బుధవారానికి ఆరో రోజుకు చేరుకుంది. పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు ముగిసి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వేదికగా వైకాపా ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహారదీక్ష బుధవారానికి ఆరో రోజుకు చేరుకుంది. పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు ముగిసిన తర్వాత తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేసిన వైకాపా ఎంపీలు ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహారదీక్షకు దిగిన విషయం తెల్సిందే.
 
ఈ దీక్షాశిబిరంలో వైకాపా ఎంపీలు ఎంపీలు అవినాష్, మిథున్ రెడ్డి‌లతో పాటు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద రావు తదితురులు పాల్గొన్నారు. వీరి దీక్ష ఆరో రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న ఎంపీలతో వైకాపా అధినేత జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం దిగివచ్చేంత వరకు దీక్షను విరమించవద్దని ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. 
 
కాగా, దీక్షలో పాల్గొన్న ఎంపీల్లో వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మేకపాటిల ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. అలాగే, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోంది. కడుపు నొప్పితో మిథున్ రెడ్డి, తీవ్రమైన తలనొప్పితో అవినాష్ రెడ్డి బాధ‌ప‌డుతున్నారు. వీరికి డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు.