బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 9 ఏప్రియల్ 2018 (15:11 IST)

రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు సిద్ధం : టీడీపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలుదేశం పార్టీ సభ్యులు ప్రకటించారు. అయితే, ముందుగా వైకాపా సభ్యులు రాజీనామాలు చేయాలని డిమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజ్యసభ సభ్యత్వాలను వదులుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలుదేశం పార్టీ సభ్యులు ప్రకటించారు. అయితే, ముందుగా వైకాపా సభ్యులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆందోళన ఉధృతం చేశారు. హోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని ఎంపీ తోట నర్సింహం ప్రకటించారు. అయితే, ముందు వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి బయటకు వస్తే తాము కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించారు. 
 
విజయసాయిరెడ్డికి సిగ్గుందా అని మండిపడ్డారు. పార్లమెంట్ అంటే లోక్‌సభ, రాజ్యసభ రెండూ అని... కేవలం లోక్‌సభ సభ్యులు రాజీనామాలు చేసి ఇతరులు రాజీనామా చేయాలని అనడం సరికాదన్నారు. ఎవరు ఎవరికి అన్యాయం చేశారనేది ప్రజలకు తెలుసన్నారు. 
 
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల సమర్ధుడు చంద్రబాబు మాత్రమే అని ప్రజలు అధికారం కట్టబెట్టారని తెలిపారు. బీజేపీతో వైసీపీ నేతలు లాలూచీ పడ్డారని విమర్శించారు. వైసీపీ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని ఎంపీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించడం లేదని ఆయన నిలదీశారు.