టెక్కలి బుద్ధుని విగ్రహం కుడి చేయి ధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీకాకుళం టెక్కలిలో బుద్ధుని విగ్రహం కుడి చేతిని దుండగులు ధ్వంసం చేశారు. నెల రోజుల వ్యవధిలో బుద్ధుని విగ్రహం ధ్వంసం కావడం ఇది రెండోసారి.
బుద్ధుని విగ్రహం కుడి చేతి భాగాన్ని నెల క్రితం దుండగులు విరగ్గొట్టారు. శిల్పి సాయంతో కొత్త చేతిని అధికారులు అమర్చారు.
నిన్న రాత్రి మళ్లీ అదే భాగాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈ రాజు ఫిర్యాదు మేరకు సీఐ నీలయ్య విచారణ చేపట్టారు.