గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (12:28 IST)

పోలవరం జంట సొరంగాల పనులు ప్రారంభం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆగిపోయిన ట్విన్‌ టన్నెల్స్‌ (జంట సొరంగాలు) నిర్మాణ పనులకు ఆదివారం జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు సంస్థల అధికారులు పూజలు చేసి శ్రీకారం చుట్టారు.

ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు ప్రధాన ద్వారాలైన ఈ జంట సొరంగాల పనులు 2018 నవంబరులో ఆగిపోయాయి. ఈ సొరంగాల నిర్మాణానికి ప్రొటెక్షన్‌ వాల్‌ కాంక్రీటు పనులను అధికారులు ఇప్పుడు ప్రారంభించారు.

డిప్లేషన్‌ స్లూయిజ్‌ గేట్లలో 4 ఎమర్జెన్సీ గేట్లు, 2 సర్వీస్‌ గేట్లు ఉంటాయి. వీటి నిర్మాణం ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తవుతుందని.. సొరంగాల పనులు జూలై నాటికి పూర్తవుతాయని అధికారులు తెలిపారు.