గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (21:11 IST)

పోలీస్ నాన్న పోలీస్ కూతురికి 'సెల్యూట్'.. ఎక్కడ?.. ఏమా కథ? (video)

పోలీసు డిపార్ట్‌మెంట్ లో తన ఉన్నతాధికారికి సెల్యూట్ చెయ్యటం మామూలు విషయం. కానీ ఇక్కడ ఆ ఉన్నతాధికారి తన గారాలపట్టి అయితే? ఆ తండ్రి చేసే సెల్యూట్ లో ఆనందంతోపాటు ప్రేమ - గర్వం రెండూ కలగలిపి ఆ పోలీసు అధికారి కంట్లో కనిపించింది.
 
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత ఏపి పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో‌ నిర్వహిస్తున్న మొట్ట మొదటి పోలీస్ డ్యూటీ మీట్ 2021కి 'ఇగ్నైట్ అని పేరు పెట్టారు. ఇలా కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యానికి "ఇగ్నైట్" వేదికయ్యింది. 

2018 బ్యాచ్ కి చెందిన జెస్సి ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డిఎస్పి చార్జ్ తీసుకున్నారు. ప్రస్తుతమ్ తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో "దిశ" విభాగంలో భాద్యతలు నిర్వహిస్తున్నారు జెస్సి ప్రశాంతి. తిరుపతి కళ్యాణి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సర్కిల్‌ ఇంస్పెక్టర్ గా పని చేస్తున్నారు శామ్ సుందర్. 

తిరుపతిలో జరుగుతున్న పోలీస్ డ్యూటీ మీట్ లో డ్యూటిలో ఉన్న తన కూతురిని చూస్తూ మురిసిపోయారు శామ్. తన కూతురు తనకంటే పెద్ద ర్యాంక్ లో తన కంటి ముందు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ.. డ్యూటీ చేస్తుండటం దూరం నుండి చూస్తూ ఆనందంగా దగ్గరకెళ్ళి నమస్తే మేడం అంటూ సెల్యూట్ చేశారు.

తను కూడా వెంటనే సెల్యూట్ చేసి 'ఏంటి నాన్నా...' అంటూ గట్టిగా నవ్వేశారు. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడు తండ్రికి ఇంతకంటే సంతోషం మరోకటి ఉండదు, నా బిడ్డ నీతి నిజాయితీగా ప్రజలకి సేవచేస్తుందని నాకు నమ్మకం ఉందని అన్నారు సిఐ శామ్ నుందర్.

పోలీస్ తండ్రి పోలీస్ కూతురిని చూసి స్పందించిన తిరుపతి ఎస్పి రమేష్ రెడ్డి "ఇలాంటి సన్నివేశం సహజంగా నినిమాలో చూస్తుంటామ్. తిరుపతి డ్యూటీ మీట్ లో తండ్రీ కూతురు ఇలా యూనీఫామ్ ధరించి ప్రజాసేవ చెయ్యటం నాకు వ్యక్తిగతంగా చాలా ఘర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి" అని డిఎస్పి ప్రశాంతిని అభినందించారు ఎస్పి.