గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (12:02 IST)

ఆలయాల విషయంలో పోలీస్‌ శాఖ సీరియస్: గౌతమ్ సవాంగ్

ఆలయాల విషయంలో పోలీస్‌ శాఖ సీరియస్ గా వుందన డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ...

"ఇప్పటివరకు ఆలయాల్లో చోటుచేసుకున్న విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు. అంతర్వేది ఘటనకు ముందు 49 కేసుల్లో 87 మందిని, ఆ తర్వాత 78 కేసుల్లో 149 మందిని అరెస్టుచేశాం.

11,295 ప్రాంతాల్లో 37,673 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశాం.రాష్ట్రంలో 57,493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్‌ చేసి మ్యాపింగ్‌ చేశారు. వేలాది సీసీ కెమెరాలు అమర్చారు.
 
దేవాయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్‌ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు. కృష్ణా జిల్లా గుడివాడ గంగానమ్మ గుడి హుండీ చోరీకి మత రంగు పులిమి విపక్షాలు ఆందోళనలు చేశాయి.

వాస్తవానికి మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులు డబ్బులు కోసం హుండీ పగలగొట్టారని దర్యాప్తులో నిగ్గుతేల్చిన పోలీసులు ఆ తర్వాత వారిని అరెస్టుచేశారు.కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ కాలభైరవ ఆలయంలో విగ్రహాలు చోరీ అవుతున్నాయంటూ జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది.

వాస్తవానికి రాజశేఖర్‌ అనే వ్యక్తి సంతానం కోసమే విగ్రహ భాగం చోరీ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.అలాగే, శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల సరస్వతీదేవి విగ్రహ విధ్వంసంపై అన్యమతాల వారే చేశారంటూ ఒక వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడు.

వాస్తవానికి సరస్వతీదేవీ విగ్రహాన్ని ఎవరూ విధ్వంసం చేయలేదని గుర్తించి ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు" అని పేర్కొన్నారు.