శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (10:30 IST)

శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం

తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం ముగిసింది. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కోవిడ్ నిభందనలు పాటిస్తూ టిటిడి ఏకాంతంగా చక్రస్నాన మహోత్సవాన్నీ నిర్వహించింది. 
 
ఏడాదికి నాలుగుసార్లు స్వామివారికి చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రధసప్తమి, అనంత పద్మనాభ వ్రతం సందర్భంగా చక్రస్నానం నిర్వహణ వుంటుంది.

ఇదిలా వుండగా.. శ్రీవారి ఆలయం దగ్గర శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు ఆందోళనకు దిగారు. తమను సరిగా దర్శనం చేసుకోనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.

రూ.11 వేలు పెట్టి టికెట్టు కొన్న తమను దర్శనం చేసుకోనివ్వకుండా... తిరుమల తిరుపతి దేవస్థానం సబ్బంది వేగంగా బయటకు తోసివేశారని భక్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే టీటీడీ సిబ్బందితో శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులు వాగ్వాదానికి దిగారు.