బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (09:15 IST)

జనవరి 4 నుంచి ట్రిపుల్‌ ఐటి ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీ (ఆర్‌జియుకెటి)ల్లోని ట్రిపుల్‌ ఐటి ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జనవరి 4 నుంచి 8 వరకు 1వ ర్యాంకు నుంచి 4వ ర్యాంకు వరకు అన్ని క్యాటగిరీలకు సంబంధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ జరగనుంది.

9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు అభ్యర్థుల కేటగిరీ వారీ కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అన్ని క్యాటగిరీలకు ఒక్కసారే కౌన్సెలింగ్‌ జరగనుంది. జనవరి 9న బిసి కేటగిరీలో 4001 నుంచి 5 వేల వరకు ర్యాంకు సాధించిన అభ్యర్థులకు, ఆ రోజు మధ్యాహ్నం 5001 నుంచి 7 వేల వరకు ర్యాంకు సాధించిన బిసి-ఎ అభ్యర్థులను కౌన్సెలింగ్‌కు పిలవనున్నారు.

జనవరి 10న బిసి-సిలో 5001 నుంచి 16 వేల ర్యాంకులు సాధించిన అభ్యర్థులు, బిసి-ఇ విభాగంలో 5001 నుంచి 11 వేల ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ జరగనుంది. 11వ తేదీన ఉదయం పూట ఎస్‌సి విభాగంలో 4001 నుంచి 12 వేలు సాధించిన అభ్యర్థులకు, మధ్యాహ్నం 4001 నుంచి 20 వేల ర్యాంకు సాధించిన ఎస్‌టి అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ జరగనుంది.

కౌన్సెలింగ్‌కు హాజరైన అభ్యర్థులందరికీ అడ్మిషన్‌ ఉంటుందనే గ్యారెంటీ లేదని ఆర్‌జియుకెటి కౌన్సిల్‌ వెల్లడించింది. ఆర్‌కె వ్యాలీ గానీ, నూజివీడు క్యాంపస్‌లో గానీ అభ్యర్థులు గడువులోగా రిపోర్టు చేయాలని పేర్కొంది. సరైన సమయంలో రిపోర్టు చేసిన వారికే సీట్ల కేటాయింపు ఉంటుందని, గడువు ముగిసిన తరువాత రిపోర్టు చేస్తే కౌన్సిల్‌కు బాధ్యత లేదని వెల్లడించింది.

బిసి, ఎస్‌సి, ఎస్‌టి, ఇడబ్ల్యూఎస్‌ కేటగిరి అభ్యర్థులు అందుకు సంబంధించిన ధ్రవపత్రాలు కౌన్సెలింగ్‌ ముగిసేలోపు సమర్పించాలని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌, రిఫండబుల్‌ ఫీజు కింద జనరల్‌ కేటగిరికి చెందినవారు రూ.3500, ఎస్‌సి, ఎస్‌టి అభ్యర్థులు రూ.3000 చెల్లించాలి.
 
కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:
 
తేదీ                        ఉదయం                     మధ్యాహ్నం
జనవరి 4         1 నుంచి 200వ ర్యాంకు     201 నుంచి 400 వరకు
జనవరి 5           401 నుంచి 800             801 నుంచి 1200
జనవరి 6         1201 నుంచి 1700          1701 నుంచి 2వేలు
జనవరి 7          2001 నుంచి 2,600         2,601 నుంచి 3వేలు
జనవరి 8         3001 నుంచి 3,600          3,601 నుంచి 4వేలు