మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:24 IST)

రాష్ట్రాభివృద్ధికి అండగా ఉండాలని స్వామివారిని కోరుకున్నా: మంత్రి వెలంపల్లి

ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అద్వితీయంగా కొనసాగుతున్న రాష్ట్రాభివృద్ధికి అండగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.

మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వన్‌టౌన్‌ బ్రాహ్మణవీధిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో స్వామి వారిని ఉత్తర ద్వారం మీదుగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతంర ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వైష్ణవాలయాల్లోనూ శుక్రవారం ముక్కోటి పర్వదినం వైభవంగా జరుగుతుందన్నారు.

ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర అభివృద్ధి జరిగేందుకు తోడుగా ఉండాలని స్వామి వారిని వేడుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఆలయానికి వచ్చిన ఆయ‌న‌కు ఈ సంద‌ర్భంగా ఆలయ ఛైర్మన్‌ గుడిపాటి పాపారావు, ఈవో గెల్లి హరిగోపీనాధ్‌‌బాబు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కెనాల్‌రోడ్డులోని వినాయకుని ఆలయాన్ని దర్శించుకున్నారు.