గురువారం, 20 మార్చి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 మార్చి 2025 (21:46 IST)

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

Taro Leaves
Taro Leaves
మధుమేహ వ్యాధిగ్రస్థులకు చేమదుంపల ఆకులు ఎంతగానో ఉపయోగడతాయని ఆయుర్వేదం చెప్తుంది. చూడడానికి గుండె ఆకారంలో కనిపించే చేమదుంప ఆకులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు సంజీవిని అని చెప్తారు ఆయుర్వేద నిపుణులు. చేమదుంపల ఆకులలో పీచు, కార్బోహైడ్రేట్, విటమిన్ A, C, E, విటమిన్ B6, ఫోలేట్ అనే విటమిన్ B-9 ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, ఫాస్పరస్ ఎముకలకు దంతాలకు బలాన్నిస్తాయి. 
 
విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా వుండే ఈ చేమదుంపల ఆకులు రక్తంలో తెల్ల రక్తాన్ని పెంచుతాయి. బీటాకెరోటిన్ ద్వారా కంటి సంబంధిత రుగ్మతలు చేరవు. అలాగే క్యాన్సర్‌ను ఇది నిరోధిస్తుంది. ఇంకా ఇందులోని విటమిన్ A, E , చర్మాన్ని సంకోచించకుండా కాపాడుతుంది. విటమిన్ ఎ, ఇ, చర్మంపై మొటిమలు, మచ్చలను దూరం చేస్తుంది. ఇందులోని పీచు జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. 
 
చేమదుంపల ఆకులను శుభ్రంగా కడిగి, నీటిలో వేసి ఉడికించాలి. తర్వాత, ఆ నీళ్లను వడపోసి తీసుకోవాలి. మహిళలకు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌ను చేమదుంపల ఆకులు నిరోధిస్తాయి. ఇందులోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన క్యాన్సర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. అలాగే, పేగు క్యాన్సర్‌ను నిరోధించే శక్తి ఉంటుంది. 
Chema Dumpa
Chema Dumpa
 
ఇంకా మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారికి చేమదుంపల ఆకులు మంచి ఔషధంగా ఉంటుంది. చేమదుంపల ఆకుల కషాయం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. చేమదుంపల ఆకుల కషాయంలో పీచు వుండటంతో శరీర బరువు తగ్గుతుంది. ఈ ఆకుల్లో కొవ్వు, కేలరీలు తక్కువగా వుండటమే ఇందుకు కారణం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.