శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (18:40 IST)

జగన్‌ది దేశానికే ఆదర్శవంతమైన పరిపాలన: మంత్రి వెలంపల్లి

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు 8 లక్షల 78 వేల ఖాతాల్లోకి సుమారు రూ.1400 కోట్లు వైఎస్సార్ సున్నా వడ్డీని వారి ఖాతాల్లోకి జమ చెయ్యడం జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. 

రాష్ట్రంలో ని 91 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందుతున్నారన్నారు. విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని లాంఛనంగా శాసన సభ్యులు మల్లాది విష్ణు, మునిసిపల్ కమిషనర్ వి. ప్రసన్న వెంకటేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్థితులలో రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్న ఇచ్చిన మాటకు కట్టుబడి "వైఎస్సార్ సున్నా వడ్డీ" ని అమలు చేయడం జరిగిందన్నారు.

గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పావలా వడ్డీ పథకాన్ని అమలు చేశారని, తర్వాత ఆ పధకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పావలావడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా నేపథ్యంలో ఎదుర్కొంటున్న పరిస్థితులను అధిగమించి సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయడం జరుగుతున్నదన్నారు.

ఒక ప్రక్క కరోనా వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా ఎదుర్కొంటునే, ఆర్ధిక ఇబ్బందులు తలెత్తినా, ఆదాయాన్ని రాష్ట్రం కోల్పోయినా వెనకడుగు వెయ్యకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళా ఖాతాలోకి  "వైఎస్సార్ సున్నా వడ్డీ" ఫలాలను ఒకే దఫాలో జమ చెయ్యడం జరిగిందని మంత్రి తెలిపారు.

ఒక ప్రక్క కరోనాపై సమీక్షలు చేస్తూ, దేశంలోనే అత్యధికంగా టెస్టులు నిర్వహిస్తూ దేశానికే ఆదర్శవంతమైన పరిపాలన ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అభినందించక పోయినా పర్వాలేదని, విమర్శలనే లక్ష్యంగా చేసుకుని ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దని కోరుతున్నానని వెలంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
 
బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిందన్నారు. గత ప్రభుత్వం హయంలో మహిళా సంఘాల సభ్యులు కేవలం సభలు, సమావేశాలు, ఊరేగింపు లకు మాత్రమే పరిమితమైన సంఘటన లను మనం చేశామన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు. ఈ విధంగా ప్రజా సంక్షేమం పెద్ద ఎత్తున చేపట్టిన ప్రభుత్వం గతంలో ఏది లేదన్న విషయాన్ని గుర్తుంచాల్సి ఉందన్నారు. లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి, భౌతిక దూరం పాటించాల్సి ఉందన్నారు.

విదేశాల,  ఢిల్లీ ఘటన ల వల్ల కరోనా వైరస్ వ్యాప్తి అయిందని, వాటి నుంచి కోలుకుంటున్న సమయంలో కొందరు నిర్లక్ష్యంగా, క్రమశిక్షణ లేకుండా వ్యవహరిస్తూ  భౌతిక దూరం పాటించక పోవడం భాదిస్తోందన్నారు. 
 
విజయవాడ మునిసిపల్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ, నగర పరిధిలోని 3 శాసనసభ నియోజకవర్గ పరిధిలోని 1,08,865 మంది మహిళలకు చెందిన 10179 గ్రూపుల్లో రూ.15.89 కోట్ల మేర వైఎస్సార్ సున్న వడ్డీ రాయితీ వారి ఖాతాల్లో జమ అయిందన్నారు.

విజయవాడలో ని పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ని 3266 ఎస్ హెచ్ జి గ్రూప్ లకు రూ4.40 కోట్లు, మధ్య నియోజకవర్గ పరిధిలో ని 3322 ఎస్ హెచ్ జి గ్రూప్ లకు రూ5.64 కోట్లు, తూర్పు నియోజకవర్గ పరిధిలో ని 3591 ఎస్ హెచ్ జి గ్రూప్ లకు రూ.5.85 కోట్ల మేర సున్న వడ్డీ రాయితీ గ్రూపులకు చెందిన బ్యాంక్ ఖాతాలో జమ చెయ్యడం జరిగిందని తెలిపారు.