శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (15:06 IST)

హీరో నాని దంపతుల రక్తదానం!

టాలీవుడ్ లో సామాజిక స్పృహ ఉన్న హీరోల్లో నాని ఒకరు. సినిమాలే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలకు మద్దతిస్తుంటారు.

తాజాగా, తన అర్ధాంగి అంజనాతో కలిసి తలసేమియా బాధిత చిన్నారుల కోసం రక్తదానం చేశారు. ఓవైపు కరోనా సంక్షోభం తీవ్రతరమై సెలబ్రిటీలందరూ ఇళ్లకే పరిమితమైన పరిస్థితుల్లో నాని దంపతులు ముందుకువచ్చి తలసేమియా చిన్నారుల కోసం రక్తం ఇవ్వడం ప్రశంసనీయం.

ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన ఓ శిబిరానికి హాజరైన నాని, అంజన రక్తదానం చేశారు. దీనిపై ఎన్టీఆర్ ట్రస్ట్ నాని దంపతులకు కృతజ్ఞతలు తెలిపింది. లాక్ డౌన్ సమయంలోనూ రక్తం ఇవ్వడం ద్వారా అనేకమంది ప్రాణాలను కాపాడారని కొనియాడింది.