గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:29 IST)

తిరుమలలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఎలుగుబంట్లు.. ఎన్నో తెలుసా?

లాక్ డౌన్‌తో తిరుమల గిరులు పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయాయి. జనసంచారం పెద్దగా లేకపోవడంతో రోడ్లపైకి జంతువులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఘాట్ రోడ్లలో జింకలు గుంపులుగుంపులుగా తిరిగిన విషయం తెలిసిందే. ఇక పులులు కూడా తిరుమల వాసులు నివాసముండే బాలాజీనగర్ దగ్గర కనిపించాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
 
ఇక నిన్న పొడవైన నాగుపాము కనిపించింది. దీంతో టిటిడి ఉద్యోగులే భయంతో పరుగులు తీశారు. చివరకు పాములు పట్టే ఉద్యోగి భాస్కర్ ఆ పామును పట్టి అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే నిన్న రాత్రి నుంచి ఈరోజు తెల్లవారుజాము వరకు రోడ్లపై ఎలుగుబంట్ల గుంపు కనిపించింది. 
 
ఈ ఎలుగుబంట్ల గుంపు ఒకటి వెనుక మరొకటి తిరుగుతూ కనిపించాయి. ఇవి ఎటువైపు నుంచి వచ్చాయో తెలియరాలేదు. అవన్నీ గుంపులుగుంపులుగా ఉండడం.. రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ ఈ జంతువులు కనిపించాయి. దీంతో ఉదయాన్నే అటువైపుగా వెళ్ళిన కొంతమంది టిటిడి ఉద్యోగులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చారు. అయితే అప్పటికే ఆ గుంపు అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోవడంతో టిటిడి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.