గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 27 మార్చి 2020 (18:52 IST)

మొన్న తిరుమల రోడ్లపై చిరుతలు, నిన్న కేరళ రోడ్లపై పునుగు పిల్లులు

కరోనా వైరస్ విజృంభించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. దీనితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ప్రజలు ఇళ్లలో వుండేసరికి ఇపుడు అడవుల్లో వుండే జంతువులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. మొన్నటికిమొన్న తిరుమలలో జింకలు, చిరుత పులులు రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతూ కెమేరా కంటికి కనిపించాయి. 
 
ఇక ఇప్పుడు కేరళలో పునుగు పిల్లులు రోడ్లపై ఎలాంటి భయం లేకుండా చక్కగా తిరుగుతున్నాయి. కేరళలో ఓ పునుగు పిల్లి నగర రోడ్లపై తిరుగుతూ జీబ్రా లైన్ క్రాస్ చేస్తూ కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. సహజంగా ఈ పునుగు పిల్లులను కేరళలో పెంచుతూ వుంటారు. 
దీని విసర్జనతో తయారు చేసే కాఫీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండటంతో అక్కడ వీటిని ఎక్కువగా పెంచుతుంటారు. లాక్ డౌన్ నేపధ్యంలో ఇవి బయటకు వస్తున్నాయి. ఈ పునగు పిల్లులు తిరుమల అడవుల్లోనూ అరుదుగా కనిపిస్తుంటాయి.