సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (15:28 IST)

మేమే రేషన్ వస్తువులను డెలివరీ చేస్తాం.. జొమాటో

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ నేపథ్యంలో రేషన్ వస్తువులను తామే డెలివరీ చేస్తామని జొమాటో వెల్లడించింది. లాక్ డౌన్‌తో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు జనాలు గంటల పాటు వేచి చూడాల్సి వుంది. అలాగే రేషన్ షాపుల్లో బారులు తీరే క్యూలను నిరోధించే దిశగా జొమాటో కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌లో కరోనా కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్రం లాక్ డౌన్ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ సర్కారు జొమాటోతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో తొలివిడతగా ఎర్నాకులం గాంధీ నగర్ ప్రాంతంలో 8 కిలో మీటర్ల ప్రాంతంలోని ప్రజలకు రేషన్ వస్తువులను జొమాటో అందించాలని నిర్ణయించింది.

వచ్చే వారం నుంచి తిరువనంతపురం, కోహికోడ్ వంటి 17 ప్రాంతాల్లో రేషన్ సరుకులను ఇంటికే అందించేందుకు జొమాటో రంగం సిద్ధం చేస్తోంది. రేషన్ సరుకులు కావాలనుకునేవారు తమకు అవసరమైన వస్తువులను ఆన్ లైన్ ద్వారా రిజర్వ్ చేస్తే జొమాటో సిబ్బంది ఇంటికే వస్తువులను అందజేస్తారు.