శుక్రవారం, 19 జులై 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:54 IST)

ఎయిర్ టెల్ నుంచి సరికొత్త రోమింగ్ ప్లాన్

దేశంలోని ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ తన వినియోగదారుల కోసం సరికొత్త రోమింగ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ సరికొత్త ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్‌ను నాలుగు రకాలుగా విభజన చేసింది. ఈ ప్లాన్ల మేరకు రూ.648, రూ.755, రూ.799, రూ.1199లకు అందుబాటులోకి తెచ్చింది. 
 
ఈ మేరకు ఎయిర్‌టెల్‌ తన వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ల వివరాలను అందుబాటులో ఉంచింది. ఇక రూ.648 ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్‌ ఇన్‌కమింగ్‌ కాల్స్‌, ఇండియాకు 100 ఉచిత నిమిషాల ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌, 500 ఎంబీ ఉచిత డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌ వాలిడిటీని 1 రోజుగా నిర్ణయించారు. 
 
ఈజిప్టు, ఫ్రాన్స్‌, ఇండోనేషియా దేశాలకు వెళ్లేవారికి ఈ ప్లాన్‌ పనికొస్తుంది. అలాగే రూ.755 ప్లాన్‌లో 1జీబీ డేటా మాత్రమే వస్తుంది. ఎలాంటి కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు రావు. ఈ ప్లాన్‌ వాలిడిటీని 5 రోజులుగా నిర్ణయించారు. మెక్సికో, నేపాల్‌, న్యూజిలాండ్‌ దేశాల్లో ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. 
 
అదేవిధంగా, రూ.799 ప్లాన్‌లో 100 ఉచిత నిమిషాల ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌, ఉచిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌ అందిస్తున్నారు. ఈ ప్లాన్‌ వాలిడిటీ 30 రోజులు. అమెరికా, కెనడా, చైనా దేశాల్లో ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇక రూ.1199 ప్లాన్‌లో 100 ఉచిత నిమిషాల ఔట్‌ గోయింగ్‌ కాల్స్‌, ఇన్‌కమింగ్‌ కాల్స్‌ లభిస్తాయి. ఈ ప్లాన్‌ వాలిడిటీని 30 రోజులుగా నిర్ణయించారు.