సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (15:23 IST)

మోహన్ బాబును ఆత్మీయంగా హత్తుకుని ముద్దుపెట్టిన చిరంజీవి

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్ నగరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మా అధ్యక్షుడు సీనియర్ నరేష్, జయసుధ, ప్రముఖ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మోహన్ బాబు ప్రసంగిస్తుండగా చిరంజీవి కనిపిస్తే ఏదో అనాలని తాను అనుకుంటానని... తాను కనిపిస్తే ఏదో అనాలని చిరంజీవి అనుకుంటారని... ఇదంతా సరదాలో భాగమేనని చెప్పారు. 
 
ఆయన కుటుంబం, తన కుటుంబం వేర్వేరు కాదని అన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబును చిరంజీవి ఆప్యాయంగా హత్తుకున్నారు. అనంతరం మోహన్ బాబు బుగ్గపై ముద్దు పెట్టారు. దీంతో, కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది.