శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (12:23 IST)

ముద్దు సన్నివేశాల్లో నటించాలంటే కెమిస్ట్రీ చాలా ముఖ్యం : పూజా హెగ్డే

ముద్దు సన్నివేశాల్లో నటించాలంటే నటీనటుల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యమని టాలీవుడ్‌ టాప్ హీరోయిన్ పూజా హెగ్డే అంటోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకెళుతోంది. ముఖ్యంగా, ఈ అమ్మడు క్యాల్షీట్ల కోసం దర్శకనిర్మాతలు వేచిచూడాల్సిన పరిస్థితి ఉందంటే ఈ జిగేల్ రాణికి డిమాండే ఏ మేరకు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 
 
తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో అంధర చుంబనాల గురించి ప్రస్తావించింది. ముద్దు సన్నివేశాలు వెండితెరపై చూడ్డానికి చాలా బాగుంటాయని... కానీ, ఆ సన్నివేశాల్లో నటించేందుకు తాము ఎంత ఇబ్బంది పడతామో ప్రజలకు తెలియదని ఆమె వ్యాఖ్యానించారు. 
 
ముఖ్యంగా, బాలీవుడ్ చిత్రం 'మొహంజదారో' చిత్రంలో హృతిక్ రోషన్‌తో ముద్దు సీన్ ఉందని దర్శకుడు అశుతోష్ గోవారికర్ తనతో చెప్పారనీ, దీంతో తాను కూడా ముద్దు సన్నివేశంలో నటించేందుకు సిద్ధమైనట్టు చెప్పుకొచ్చింది. 
 
నిజానికి అప్పటివరకు తాను అలాంటి సీన్లలో నటించలేదని, దీంతో తనకు వెన్నులో వణుకు మొదలైందని తెలిపింది. పైగా, షూటింగ్ సందర్భంగా తమ చుట్టూ చాలా మంది ఉన్నారని... దీంతో, తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పింది. వాస్తవానికి ముద్దు సీన్లలో నటించాలంటే నటీనటుల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యమని తెలిపింది. కెమెరా ట్రిక్‌లు కూడా ఇలాంటి సన్నివేశాల్లో చాలా ఉపయోగపడతాయని చెప్పింది.