సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (19:54 IST)

మెగా ఛాన్స్ కొట్టేసిన ఐరెన్ లెగ్ హీరోయిన్?

మెగా కాంపౌండ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రతి ఒక్క నటి ఉబలాటపడుతుంటారు. అలాంటి హీరోయిన్లకు మెగా ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తున్నారు. అలాంటి అవకాశాన్ని తెలుగు చిత్రపరిశ్రమలో ఐరెన్ లెగ్‌గా పేరుపొందిన రెజీనా కాసాండ్రా కొట్టేసింది. ఈమె మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం దక్కినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి ఫిలింనగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ చిత్రంలో మాస్‌ గీతం పెట్టనున్నారట. 
 
సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ పాటలో స్టార్‌ హీరోయిన్‌ రెజీనా కాసాండ్రా మెరువనున్నట్లు టాక్‌ నడుస్తోంది. ఇదే నిజమైతే రెజీనా తక్కువ సమయంలోనే మెగాస్టార్‌ చిరుతో కలిసి డ్యాన్స్‌ చేసే అరుదైన అవకాశాన్ని కొట్టేసినట్టే. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. 
 
ఈ చిత్రాన్ని మెగా హీరో రాం చరణ్ తన నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థ కూడా ఇందులో భాగం కానుంది. సోషియా ఫాంట‌సీగా దేవాదాయ శాఖలో జ‌రిగిన అవినీతి నేప‌థ్యంలో రూపొంద‌నున్నట్లు తెలుస్తుంది.