గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (15:02 IST)

ఆయన ఖైదీ నంబరు 6093.. ఈయన ఖైదీ నంబర్ 150

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చన్న ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఇపుడు రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రకటనను విపక్ష పార్టీలతో పాటు.. రాజధాని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, అమరావతి ప్రాంత ప్రజలు సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా రాజధాని ప్రాంతం యుద్ధభూమిగా మారింది. 
 
అయితే, సీఎం జగన్ వ్యాఖ్యలకు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకటించారు. మూడు రాజధానులను రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అందువల్ల సీఎం జగన్‌ ప్రకటనను ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. 
 
ఈ పరిస్థితుల్లో చిరంజీవి చేసిన ప్రకటనపై రాజధాని రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఖైదీ నంబర్ 6039 అయితే చిరంజీవి 150 అంటూ మండిపడుతున్నారు. ఏదో రాజకీయ లబ్ది కోసమే చిరంజీవి అలా వ్యాఖ్యానించారన్నారు.