శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 డిశెంబరు 2019 (16:12 IST)

రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్నట్టుగా ఉంది : తమ్మినేని సీతారాం

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోకి వెళుతుంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్నామనే ఫీలింగ్ కలుగుతోందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అ్నారు. రాజధానిపై ఆయన చేసిన వ్యాఖ్యలపట్ల ఇపుడు ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 
 
నిజానికి ఏపీ రాజధాని అమరావతిపై ఇప్పటికే అనిశ్చితి నెలకొనివున్న విషయం తెల్సిందే. ఇలాంటి తరుణంలో ఆయన ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేసేలా సంచలన కామెంట్స్ చేశారు.
 
ఏపీ రాజధానికి వెళ్లడం అంటే రాజస్థాన్ ఎడారిలోకి వెళుతున్న ఫీలింగ్ కలుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని మిగిలిన వాళ్లు బహిరంగంగా చెప్పలకపోయారని, తాను చెప్పగలిగానని తెలిపారు. 
 
రాజధాని నాది అని రాష్ట్ర ప్రజలంతా భావించాలి, అమరావతిలో నాకు ఇది కనిపించలేదు అని తమ్మినేని అభిప్రాయపడ్డారు. మూడు రాజధానుల ప్రతిపాదనను రాష్ట్ర ప్రజలంతా స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనిపై విమర్శలు చేసేవారు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలని హితవు పలికారు.
 
కాగా, ఇంతకుముందు.. జగన్ మంత్రివర్గంలోని మంత్రులు అమరావతిని శ్మశానంతో పోల్చిన విషయం తెల్సిందే. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆ తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెరపైకి వచ్చింది.